ADB: తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలను AEE హరీశ్ కుమార్ సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 277.50 మీటర్లుగా ఉందన్నారు. మొత్తం నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలకు గానూ ప్రాజెక్టులో 0.470 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.