KDP: ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా కడప జిల్లా బద్వేల్ టౌన్‌లోని మైదుకూరు రోడ్డు సమీపంలోని గల స్టేట్ బ్యాంకు వద్దనున్న రోడ్డుపై మూడు అడుగుల మేర నీరు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.