CTR: పులిచెర్ల మండలం కల్లూరులో వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం గ్రామపంచాయతీ వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కుక్కలను పట్టించి సుదూర ప్రాంతాల్లో వదిలిపెట్టారు. అయినా నెలలు తిరగకుండానే తిరిగి వీధుల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కలు తిరుగుతున్నాయి. దీంతో కుక్కల భయంతో చిన్నారులు పరుగులు పెడుతున్నారు.