SRCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్లపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీసుకువచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలన్నారు.