అనంతపురం: రాయదుర్గం పట్టణంలో నేడు నీటి సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి మీడియాకి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణానికి నీటి సరఫరాను అందించే ప్రధాన నీటి పైప్లైన్ లీకేజీ కారణంగా నీటి సరఫరాలో ఆటంకం ఏర్పడినట్లు తెలిపారు. కావున పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని కోరారు. వరుసగా పైప్లైన్ లీకేజీలతో ప్రజలు విసుగు చెందుతున్నారు.