SKLM: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పలాస సీనియర్ జర్నలిస్ట్ దనేశ్వర మహారణా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 4,5 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగిన ఐజేయు జాతీయ కార్యవర్గం సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జర్నలిస్టులకు మహారణ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.