NLG: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని STU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి, పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొనకంచి వీర రాఘవులు అధ్యక్షత వహించారు.