NGKL: తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. గ్రామంలో మంచినీరు రాకపోవడంతో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు.