SRPT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గంగయ్య తన గొర్రెలను మేపుకుని ఆదివారం ఇంటికి వెళుతున్నాడు. ద్విచక్ర వాహనంపై సూర్యాపేట వెళ్తున్న వ్యక్తి గంగయ్యను ఢీకొని కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు.