NGKL: నల్లమల అటవీ ప్రాంతాల సందర్శనకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల కోసం సఫారీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. 3 నెలల పాటు వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంలో నిలిపివేసిన ఈ సేవలను ప్రభుత్వం పునఃప్రారంభించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని పర్యాటక ప్రాంతాలను, కృష్ణానది, జలపాతాలు, పులులు, చిరుతలను చూసేందుకు అవకాశం కల్పించారు.