KMM: పత్తి చేనులో పనిచేస్తున్న మహిళను పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది. ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన జె.రాధ నేలకొండపల్లి మండలం అనాసాగారంలో పనికి ఆదివారం వచ్చింది. పొలంలో పత్తి తీస్తుండగా పాము కాటేయడంతో మిగతా కూలీలు నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.