VSP: దసరా సెలవులు ముగియడంతో సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు అన్ని రద్దీగా మారాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ఉన్న రైళ్లకు విపరీతంగా రద్దీ పెరిగింది. జనరల్ బోగీల్లో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన గోదావరి, విశాఖ రైళ్లు కిక్కిరిసి పోయాయి.