ADB: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో టెంబి మాజీ ఎంపీటీసీ సిడం భీంరావు, మాజీ సర్పంచ్ దిగంబర్ జాదవ్, పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.