హైదరాబాద్లోని రోడ్లపై 30 వేల గుంతలు ఏర్పడ్డట్లుగా అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,009 కి.మీ R&B రోడ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, నిర్మాణంలో లోపాలే కారణంగా నిలుస్తున్నట్లుగా నిపుణులు అంచనా వేశారు. కానీ, మరమ్మతులకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.