W.G: జిల్లాలో పండుగప్ప చేపల ధరలు అమాంతం పెరిగాయి. నాలుగు నెలల క్రితం రూ. 370 ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ. 500కు చేరడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధిక ఆదాయం వస్తుండటంతో చేపల చెరువుల రైతులు పండుగప్ప జాతి చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ చేపలు జిల్లా నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయి.