WGL: ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలతో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధిక వర్షంతో పత్తి ఆకులు ఎర్రబడి, దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన మొక్కజొన్న పంట వరదలో తడిసి మొలకలు ఎత్తింది. తడిసిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.