SKLM: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు అక్టోబర్ 4 నుంచి 10 వరకు విద్యార్థులకు మానసిక ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఎంఈఓ కె.ఏ.రాములు తెలిపారు. సోమవారం ఆముదాలవలస జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలియజేశారు. హెడ్మాస్టర్ పి.రవికుమార్, కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ సూర్యప్రభ పాల్గొన్నారు.