CTR: బెంగళూరు- చెన్నై జాతీయ రహదారి కేజీ సత్రం సమీపంలో ఐచర్ వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. సోమవారం ఉదయం కమ్మరపల్లి గ్రామానికి చెందిన మునస్వామి భార్య రాజమ్మ రోడ్డు దాటుతున్న సమయంలో బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంలో మృతిచెందింది.