VKB: మర్పల్లి మండల కేంద్రంలో రోడ్డుపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు నిలుస్తోంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారులు కింద పడుతున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై ఉన్న గుంతలను మూసేందుకు సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. వర్షం తగ్గే వరకూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.