KMR: నాగిరెడ్డి పేట్ మండలం పోచారం ప్రాజెక్టులోకి 2,511 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో సోమవారం ప్రాజెక్ట్ అలుగు మీదుగా 2,471 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో దిగువకు వెళ్తాంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 1,464.00 అడుగులకు చేరుకోగా నీటి సామర్థ్యం 1.820 టీఎంసీలకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.