ప్రకాశం: సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 7వ తేదీన అండర్-19 ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బాల బాలికల హాకీ పోటీల ఎంపిక నిర్వహించనున్నట్లు సెక్రటరీ చింపారెడ్డి తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ తీసుకొని ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.