JDWL: ఉండవెల్లి మండల పరిధిలో సోమవారం తెల్లవారుజాము పెను ప్రమాదం తృటిలో తప్పింది. కడప జిల్లా ఒంటిమిట్ట నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీసీఎం వాహనం 44వ జాతీయ రహదారి పక్కన కాటన్ మిల్లు దగ్గర ఉన్న లేబర్ నివాసముంటున్న గుడిసెలోకి అకస్మాత్తుగా దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో గుడిసెలో నిద్రిస్తున్న భార్యాభర్తలు భాగ్యమతి, వీరా సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.