BDK: జూలూరుపాడులో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగీలాల్ నాయక్ తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలపై సన్నాహ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆశామహులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.