GDWL: గద్వాల నియోజకవర్గ అభివృద్ధియే తన ధ్యేయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.