హీరోయిన్ రష్మిక నటించిన ‘థామా’ ఈనెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ‘థామా’ సాంగ్ వెనక ఉన్న కథను వివరిస్తూ ఆమె పోస్ట్ పెట్టింది. ఇది దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపింది. ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చిందని.. థియేటర్లో ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తారని చెప్పింది. ఈ పాటకు సంబంధించిన స్టిల్స్‌ను పంచుకుంది.