MBNR: తెలంగాణకు ముఖ్యమంత్రిని కావాలనుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి. మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా. సీఎం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. టీజీకి తొలి మహిళా సీఎం కావడానికి కృషి చేస్తూనే ఉంటాను” అని DK వెల్లడించారు.