వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ప్రకటించిన WTC ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2025-27 WTC చక్రంలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్.. మూడింట్లో గెలిచి, రెండు ఓడింది. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని 40 పాయింట్లు సాధించింది. ఇక అగ్రస్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో శ్రీలంక ఉన్నాయి.