VZM: పైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్బంగా విజయనగరంలో మద్యం దుకాణాలు సోమవారం మూతబడ్డాయి. పట్టణంలో ఉన్న మొత్తం 14 మద్యం దుకాణాలతో పాటు 12 బార్లను అధికారులు మూసివేశారు. అలాగే జొన్నవలస, సుంకరిపేట, బియ్యాలపేటలో ఉన్న షాపులు కూడా మూతపడ్డాయి. సిరిమానోత్సవం పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి షాపులు పునః ప్రారంభం కానున్నాయి.