ADB: పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తలమడుగు ఎస్సై రాధిక తెలిపారు. ఆదివారం విశ్వసనీయ సమాచారం మేరకు కజ్జర్ల గ్రామంలోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 5గురు నిందితుల వద్ద రూ.15900 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో పేకాట ఆడితే సమాచారం అందజేయాలన్నారు. వివరాలను గోప్యంగా ఉంచటం జరుగుతుందని తెలిపారు.