KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 6 గంటలకు 16,507 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 3 వరద గేట్లను ఎత్తి 10,987 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి ఏఈఈ అక్షయ్ తెలిపారు.