VSP: జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కంచరపాలెంలోని ఇందిరానగర్-5లో ముగ్గురు దుండగులు ఇంట్లో చొరబడి వృద్ధురాలు, అతని మనవడిని తాళ్లతో కట్టేశారు. 10 తులాలు బంగారం, రూ. 3లక్షల నగదు దొచుకుని కారులో పరారయ్యారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలు ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు.