KRNL: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ ఈ నెల 6న కర్నూలుకు రానున్నారని జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఆయన బీఏఎస్ కళ్యాణ మండపంలో జరగనున్న యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు మౌర్య ఇన్ హోటల్ నుంచి ఎస్వీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు.