ప.గో: నరసాపురం రూరల్ స్టేషన్ పరిధిలోని తుందుర్రు శివారులోని కోడి పందాల స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడుల్లో 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్ఐ టి. వెంకట సురేశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 23,260 నగదు, 10 మోటార్ సైకిల్స్, 4 ఫోన్లు, 2 కోడి పుంజులు, 2 కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.