KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లి హైస్కూల్‌కు చెందిన 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఒకచోట కలుసుకున్న స్నేహితులు తమ అనుభవాలను, ఆనందాన్ని పంచుకున్నారు. పాఠశాల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు.