సత్యసాయి: ప్రతి పౌరుడిలో దేశభక్తితో పాటు కర్తవ్య భావన, హిందూత్వం అనే జీవన విధానం ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ముదిగుబ్బలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వార్థం లేకుండా పనిచేయడమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని తెలిపారు.