HYD: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై శాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలిలా.. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫతేదర్వాజాకు చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.