ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల నుంచి పెదవలస వెళ్లే రహదారి మధ్యలో బొంతువలస ఘాట్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు అడ్డతీగల మండలంలోని డీ.కొత్తూరు గ్రామానికి చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు అని స్థానికులు తెలిపారు. మృతుడు నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబీకులు తెలిపారు. ఘటనపై కొయ్యూరు, జీకేవీధి పోలీసులకు సమాచారం అందించారు.