VSP: సోమవారం పీఎంపాలెంలో ఒకరి అనుమానస్పద మృతదేహం లభ్యమయ్యింది. పీఎంపాలెం రామాలయం పక్కన మురుగు కాలువలో పడి అనుమానస్పద స్దితిలో ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. స్థానికులు మృతి చెంది ఉన్న విషయం పీఎంపాలెం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.