ఆస్ట్రేలియా-ఎతో అనధికార మూడు వన్డేల సిరీస్‌ను భారత్-ఎ 2-1తో చేజిక్కించుకుంది. ఆదివారం నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో భారత్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ (102), శ్రేయస్ (62), పరాగ్ (62) రాణించారు.