TG: పత్తి కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇవాళ సీసీఐ ఎండీ, జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ కానున్నారు. రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు జరపనున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరలు తక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బంది పడకుండా.. సమర్థవంతమైన కొనుగోళ్లు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.