VSP: జిల్లాలో 75 మంది తెలుగు, ముగ్గురు హిందీ భాష పండితులకు పదోన్నతులు లభించాయి. చివరిగా 2019లో కొందరికి పదోన్నతులు కల్పించి మిగిలిన వారిని డీఈఓ పూల్లో ఉంచారు. డీఈఓ పూల్లో ఉన్న 75 మంది భాష పండితులకు అడహక్ బేసిక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తూ విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.