»Union Minister Of Civil Aviation Ram Mohan Naidu Kinjarapu Visited Delhi Airports Terminal 1
Delhi airport : దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ని పరిశీలించిన విమానయాన శాఖ మంత్రి.. నష్టపరిహారం ప్రకటన
వర్షాలకు దిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో పైకప్పు కూలిన విషయం తెలిసిందే. దీంతో యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు ఎయిర్‌పోర్ట్‌ని పరిశీలించారు. ఈ విషయమై ఆయన ఏమన్నారంటే.??
Ram Mohan Naidu Kinjarapu : దిల్లీలో భారీ వర్షాలకు ఈ తెల్లవారుజామున విమానాశ్రయం టెర్మినల్1లో పైకప్పు కూలి పండింది. కిందున్న కార్లపై పడటంతో అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu Kinjarapu) ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనలో ఒకరు ప్రాణాల్ని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. వారికి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి రూ.20లక్షలు నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన వారి కుటుంబాలకు సైతం రూ.3లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఇప్పుడు కూలిపోయిన భవనం 2009లో ప్రారంభించినదని ఆయన అన్నారు. దీనిపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
ఫైర్ సేఫ్టీ టీమ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్టీంలు ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వారు నిరంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తారని చెప్పారు. ప్రస్తుతం టెర్మిల్1(Terminal 1) మొత్తాన్ని మూసివేసినట్లు తెలిపారు. భవనం పాతది కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని అన్నారు. దీనిపై పూర్తిగా విచారించిన తర్వాత ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. టెర్మినల్ పైకప్పు కూలిపోవడంతో అక్కడి నుంచి బయలు దేరాల్సిన పలు విమాన సర్వీసుల్ని నిలిపి వేశారు.
#WATCH | Union Minister of Civil Aviation Ram Mohan Naidu Kinjarapu says, “…A section of the canopy which is outside of the airport has collapsed due to heavy rains. We express our condolence to the life that has been lost in this tragic incident, four people have also been… https://t.co/8Bs7Jm5A1Zpic.twitter.com/gmArDd6ydz