Tiger Nageswara Rao runtime Is Ravi Teja taking a risk
tiger nageswara rao : హీరో రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’(tiger nageswara rao) సినిమా వినికిడి శక్తి లేని వారిని సైతం అలరించే విధంగా కొత్త వెర్షన్ సిద్ధమైంది. సైన్ లాంగ్వేజ్‌లో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. భారతీయ సినిమాల్లో ఇలా సైన్ లాంగ్వేజ్‌లో విడుదల అయిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో మొదటి సైన్ లాంగ్వేజ్(sign language) సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఎక్స్ ద్వారా వెల్లడించింది.
చదవండి : ‘పుష్ప 3’ ఉంది.. కానీ అప్పుడే సెట్స్ పైకి?
వినికిడి శక్తి లేని దివ్యాంగులు అంతా ఈ వెర్షన్‌ను చూసి సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. సినిమాలో ప్రతి డైలాగ్‌నీ పక్కన సైన్ లాంగ్వేజ్ఎక్స్పర్ట్ వివరిస్తూ ఉంటారు. దీంతో సినిమా అంతా వారు సైగల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై మేకర్స్ ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ సైన్ లాంగ్వేజ్‌లో(sign language) అందుబాటులో ఉన్న మొదటి ఇండియన్ సినిమా తమ ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటూ వెల్లడించారు.
చదవండి : ‘విశ్వంభర’ సాలిడ్ లీక్.. పెద్ద మనుషులు, పెద్ద చెవులు?
రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, రేణు దేశాయ్ తదితరులు నటించారు. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించారు. 2023లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని విడుదల చేశారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా విజయవంతం కాలేదు. ఆ తర్వాత దీని ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్(amezon prime) సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సైన్ వెర్షన్ కూడా ప్రైమ్‌లోనే అందుబాటులో ఉంది.

