మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ ఉన్నట్టుండి ట్విట్టర్లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దానికి కారణం ఏంటా అని చూస్తే.. చడీ చప్పుడు కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది టైగర్ నాగేశ్వర రావు.
పోయిన దసరాకు టైగర్ నాగేశ్వరావు(tiger nageswara rao)గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాస్ మహారాజా రవితేజ. అయితే డే వన్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. వంశీ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా సినిమా కమర్షియల్‌గా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. కానీ రవితేజ మార్క్ వినోదం, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను బాగానే ఎంటర్టైన్ చేశాయి. అయితే.. ఈ సినిమా రిలీజ్ అయిన నెల రోజులలోపే సైలెంట్‌గా ఓటిటిలోకి వచ్చేసింది.
ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు అమెజాన్ ప్రైమ్(amazon prime)లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ముందుగా నవంబర్ 27న టైగర్ నాగేశ్వర రావు ఓటీటీలోకి వస్తుందని వార్తలు రాగా.. పది రోజుల ముందుగానే ఈ పాన్ ఇండియా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రస్తుతం ఓటిటిలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది టైగర్ నాగేశ్వర రావు.
ట్విట్టర్లో టైగర్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమాలో హైలెట్‌గా నిలిచిన సీన్స్‌ను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు మాస్ రాజా(ravi teja) ఫ్యాన్స్. ఇక ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. నుపూర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరో కీలక పాత్రలో మెరిశారు. మరి ఫైనల్‌గా ఓటిటిలో టైగర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.