ఆర్ ఎక్స్ 100 తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి లేటెస్ట్ ఫిల్మ్ 'మంగళ వారం(Mangalavaram)' ఎట్టకేలకు ఈ వారం ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో.. హీరో రేంజ్ క్యారెక్టర్ ఒకటి దాచి ఉంచారు. ఆ ప్లేస్‌లో యంగ్ హీరో ఉండి ఉంటే.. సినిమా గ్రాఫ్ మారి ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితే అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమా మంగళ వారం(Mangalavaram). పాయల్(payal rajput)తో పాటు అజ్మల్ అమీర్, నందిత శ్వేత కీ రోల్ ప్లే చేసి మంగళవారం సినిమా.. నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అజయ్ ఎవరు టచ్ చేయని పాయింట్ టచ్ చేశారంటూ.. మంగళ వారంకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ముందు నుంచి చెప్పినట్టుగా ఈ సినిమా ఒక బోల్డ్ అటెంప్ట్ అని అంటున్నారు. తెలుగు నుంచి ఈ వారం రిలీజ్ ఈ సినిమాల్లో మంగళ వారందే పై చేయిగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరో లాంటి క్యారెక్టర్‌తో సర్ప్రైజ్ చేశాడు అజయ్. పాయల్‌కు జోడీగా నటించిన ఆ క్యారెక్టర్‌ను ప్రమోషన్స్‌లో ఎక్కడ రివీల్ చేయలేదు.
అందుకే.. సినిమాలో బలగం సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శిని చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు ఆడియెన్స్. ఈ సినిమాలో రవి(ravi) అనే పాత్రలో పాయల్ రాజ్‌పుత్ సరసన.. ఆమెను ప్రేమించే వ్యక్తిగా కనిపించాడు ప్రియదర్శి(priyadarshi). అయితే ఈ పాత్రలో పేరు ఉన్న మరో హీరోని తీసుకుని ఉంటే అదిరిపోయేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రియదర్శిని క్యారెక్టర్‌కు కాస్త హీరో టచ్ ఇచ్చి ఆర్ఎక్స్ 100 సినిమా పెయిర్‌ను రిపీట్ చేసి ఉంటే మామూలుగా ఉండేది కాదని అంటున్నారు. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, కార్తికేయ మరోసారి కలిసి నటించలేదు. అయితే అజయ్ భూపతి మాత్రం మళ్లీ ఈ ఇద్దరితో కలిసి సినిమా చేయనని చెబుతున్నాడు. అందుకే కాబోలు.. మంగళవారంలో కార్తికేయ ఓ ఆప్షన్‌గా రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఈ హిట్ పెయిర్ కలిసి నటిస్తే మాత్రం సినిమా గ్రాఫ్ మారిపోయి ఉండేది.