Anil Ravipudi: పొలిటికల్ పార్టీ? అసలు మ్యాటర్ ఇదే!
ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా పొలిటీషియన్ అవతారం ఎత్తాడు. మరి అనిల్ రావిపూడి పెట్టబోయే పార్టీ ఏది? అసలు మ్యాటర్ ఏంటి?
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని అనిల్ రావిపూడి.. రీసెంట్గా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఉన్నట్టుండి పొలిటీషియన్ అవతారం ఎత్తాడు అనిల్ రావిపూడి. అనిల్ రాజకీయ నాయకుడిగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అందులో పొలిటికల్ లీడర్ గెటప్‌లో కుర్చీలో కూర్చున్న అనిల్ రావిపూడి.. ఇప్పటి వరకు సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. మీరు ఎంటర్టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరు. కానీ ఈ సారి నా గెలుపు థియేటర్లో కాదు. ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్లో ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు పంపిస్తారుగా.. అంటూ అడిగాడు. అలాగే ఒక పార్టీ పెట్టబోతున్నా.. మన పార్టీ పేరేంటో, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం వివరాలతో త్వరలో వస్తా.. అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియో చూసి నిజంగానే అనిల్ రావిపూడి పొలిటికల్ ఎంట్రీ(political entry) ఇస్తున్నాడంటే పొరబడ్డట్టే. ప్రస్తుతం ‘ఆహా’ ఓటిటి కోసం ఓ కామెడీ షో చేస్తున్నాడు అనిల్. ఇక ఇప్పుడు ఆహా(aha) కోసం ఒక పొలిటికల్ వెబ్ షో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ షో గురించి క్లారిటీ రానుంది.