Sapta Sagaralu Dhaati Side B Review: సప్తసాగరాలు దాటి సైడ్ బీ మూవీ రివ్యూ
ఫీల్ గుడ్ మూవీగా పేరుతెచ్చుకున్న సప్తసాగరాలు దాటి సైడ్ ఏకు సీక్వెల్‌గా సైడ్ బీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యువతి జీవితం కోసం తపన పడే ప్రియుడి కోణం ఓవైపు.. అలాంటి వ్యక్తి జీవితంలోకి మరో అమ్మాయి వస్తే ఎలాంటి డ్రామా కొనసాగుతుందనే కోణంలో ట్రయాంగిల్ లవ్ స్టోరినీ ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. లవ్, ఎమోషన్స్, ఫన్, రివేంజ్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ఎంత మేరకు మెప్పించిందో తెలియాలంటే సప్తసాగరాలు దాటి సైడ్ బీ చూడాల్సిందే.
Sapta Sagaralu Dhaati Side B Review: 777చార్లీ సినిమాతో తెలుగులో పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి(Rakshith Shetty) సప్తసాగరాలు దాటి సినిమాలో హీరోగా నటించారు. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) కథానాయికగా నటించారు. సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. తెలుగులో సప్తసాగరాలు దాటి సైడ్-ఏ పేరుతో సెప్టెంబర్ 22న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దానికి కొనసాగింపుగా సైడ్ బీ(Sapta Sagaralu Dhaati Side B ) ఈ శుక్రవారం విడుదల అయింది. మరి ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం.
కథ:
జైలు శిక్ష పూర్తి అయిన తరువాత మను (రక్షిత్ శెట్టి) విడుదల అవుతాడు. తన లవర్ ప్రియ (రుక్మిణి వసంత్) కోసం వెతుకుతాడు. ప్రియను వెతకడం కోసం తన స్నేహితుడు ప్రకాశ్ సాయం చేస్తాడు. తాను దీపక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక బాబుతో కాపురం చేస్తుందని తెలుసుకొంటాడు. తాను కటిక పేదరికంలో బతకడం తెలుసుకొని మను తట్టుకోలేకపోతాడు. ప్రియ, దీపక్ జీవితాలను మార్చాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో సురభి (చిత్ర జై ఆచార్) అనే వేశ్య అమ్మాయి కనెక్ట్ అవుతుంది. ఇలా కథ సాగుతున్న సమయంలో జైలులో శత్రువుగా మారిన సోము (రమేష్ ఇందిర) ఎదురు పడుతాడు. ప్రియ భర్త దీపక్ అప్పుల్లో ఎందుకు కూరుకుపోయాడు? ప్రియ, దీపక్‌లను మను ఎలా ఆదుకున్నాడు? సురభీతో మను ఎలాంటి బంధం కొనసాగింది. సోమును ఎలా ఎదుర్కొన్నాడు? సింగర్ కావాలన్న ప్రియ ఆశంయ నెరవేరిందా? మోసం చేసిన ప్రభు (అచ్యుత్ కుమార్)ను మను ఎం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సప్తసాగరాలు దాటి సైడ్ బీ.
ఎలా ఉందంటే:
జైల్ నుంచి వచ్చిన మను ప్రియ కోసం వెతికే తరుణంలో వేశ్య సురభి పరిచయం సినిమా ఎమోషనల్‌గా, ఫన్‌గా సాగుతుంది. అయితే స్టోరీలో డీటైలింగ్ ఎక్కువ అవడం మూలాన స్టోరీ ల్యాగ్ అనిపిస్తుంది. సినిమా రైటింగ్ చాలా బాగా రాసుకున్నప్పటికీ కథను వేగంగ చెప్పితే బాగుండేది అని పిస్తుంది. కథను కొంచెం ఫాస్ట్‌గా చెప్తే బాగుండు అని ప్రతి ప్రేక్షకుడికి అనిపిస్తుంది. ప్రియ జీవితాన్ని బాగు చేయాలన్న ఒక సింగిల్ పాయింట్‌తో సినిమా మొత్తాన్ని రన్ చేయడం కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. ఇక ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్లను పరిచయం చేయడం, వాటి చుట్టు జరిగే సంఘర్షణలను చూపించారు. కాస్త కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో నడిపించారు.
ఇక సెకండాఫ్‌లో ప్రియ జీవితాన్ని చక్క బెట్టడమే లక్ష్యంగా కథ సాగుతుంది. మధ్యలో సోము, ప్రభు క్యారెక్టర్లను తీసుకొచ్చి రివేంజ్ డ్రామాను నడిపించారు. అది కొంత వరకు ప్రేక్షకుడికి బెటర్ ఫీలింగ్‌ను అందించింది. సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, హై మూమెంట్స్ ఉన్నప్పటికీ.. స్లో నరేషన్ కారణంగా ఫీల్‌గుడ్ మూమెంట్స్ కాస్త బోర్ కొడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మొత్తానికి ఎమోషనల్ డ్రామాతో రెండో పార్ట్ ముగుస్తుంది.
ఎవరెలా చేశారు:
సినిమాకు మెయిల్ లీడ్ రక్షిత్, రుక్మిణి తమ పాత్రలతో భావోద్వేగాన్ని పండించారు. రక్షిత్ పాత్ర విషయానికి వస్తే సైడ్ బీలో మరిన్ని వేరియేషన్స్ ఉంటాయి. కేవలం భావోధ్వేగం సీన్స్‌లోనే కాకుండా రివెంజ్ డ్రామాలో కూడా రక్షిత్ చేసిన పెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే సైడ్ బీలో సురభి క్యారెక్టర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది. సురభీగా చైత్ర జే ఆచార్ చిలిపిగా, ఎమోషనల్‌గా తన పాత్రతో మెప్పించింది. ఇక సోముగా రమేష్ ఇందిర, అలాగే ప్రభుగా అచ్యుత్ కుమార్ తమదైన శైలిలో ఆకట్టుకొన్నారు.
సాంకేతిక అంశాలు:
సన్నివేశాలను దర్శకుడు హేమంత్ రావు బాగా రాసుకొన్నప్పటికీ వేగంగా తెరకెక్కిస్తే చాలా బాగుండేది అన్న భావన కలుగుతుంది. డైరెక్టర్ గా తను ఎఫెర్ట్ పెట్టినా సీన్స్ లెంగ్త్ కారణంగా కొంత ప్రజల సహనాన్ని పరిక్షించాడు. సైడ్ ఏ మూవీకి ఏ మాత్రం తగ్గకుండా సైడ్ బీలో చరణ్ రాజ్ బీజీఎం ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్ పరంగా సునీల్ ఎస్ భరద్వాజ్ కట్ చేయడం మర్చిపోయాడు అనిపిస్తుంది. సినిమాను కనీసం 15 నిమిషాలు కట్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.