»Hero Satyadev Rajamouli Sukumar Koratala Moving For A Young Hero
Hero Satyadev: యంగ్ హీరో కోసం కదిలొస్తున్న రాజమౌళి, సుకుమార్, కొరటాల!
టాలీవుడ్లో ఈ మధ్య చాలా సినిమా ఈవెంట్లు జరిగాయి. కానీ ఇప్పుడు జరగబోయే ఈవెంట్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలిచేలా ఉంది. యంగ్ హీరో సత్యదేవ్ కోసం ఏకంగా ఐదుగురు స్టార్ దర్శకులు కదిలి రావడం ఆసక్తికరంగా మారింది.
Hero Satyadev: అప్పుడప్పుడు టాలీవుడ్ దర్శక దగ్గజాలంతా ఒకే వేదిక పై కనిపిస్తుంటారు. లేటెస్ట్గా రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని లాంటి స్టార్ డైరెక్టర్స్ అంతా.. ఓ యంగ్ హీరో కోసం కదిలొస్తున్నారు. సరైన కథలు ఎంచుకోవడం లేదా? లేక కరెక్ట్ డైరెక్టర్ తగలడం లేదో ఏమో గానీ.. టాలెంటెడ్ హీరో సత్యదేవ్‌కి మాత్రం సరైన హిట్ పడడం లేదు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ అంతా ఫిదా అయ్యారు. అలాంటి ఈ యాక్టర్‌కు ఒక్క సాలిడ్ సబ్జెక్ట్ పడితే అదిరిపోతుంది.
అందుకే.. లేటెస్ట్గా కృష్ణమ్మ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున్న ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తుండగా.. కొరటాల శివ సమర్పిస్తున్నాడు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. అందుకే.. కృష్ణమ్మ కోసం స్టార్ డైరెక్టర్స్ కదిలి వస్తున్నారు.
కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ట్రైడెంట్ హౌటల్లో మే 1 సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. అయితే.. ఈ వేడుకకు ఏకంగా ఐదుగురు తెలుగు స్టార్ డైరెక్టర్లు ముఖ్య అతిథిలుగా వస్తుండడం ఆసక్తికరంగా మారింది. మరి కృష్ణమ్మతో సత్యదేవ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.