»Harihara Viramallu Harihara Veeramallu Teaser Time Fix But Big Shock For The Director
Harihara Viramallu: ‘హరిహర వీరమల్లు’ టీజర్ టైం ఫిక్స్.. కానీ దర్శకుడికి బిగ్ షాక్!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి టీజర్ వస్తున్నట్టుగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే.. ఈ సందర్భంగా క్రిష్ పేరు పోస్టర్లో లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరి హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నాడా?
Harihara Viramallu: 'Harihara Veeramallu' teaser time fix.. but big shock for the director!?
Harihara Viramallu: హరిహర వీరమల్లు సినిమాను పవన్ ఫ్యాన్స్ దాదాపుగా మరిచిపోయారు. ఈ సినిమా పై ఉన్న అంచనాలకు.. అనుకున్న సమయానికి కంప్లీట్ అయి ఉంటే.. పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలై ఉండేది. కానీ గత రెండు మూడేళ్లుగా డిలే అవుతునే ఉంది హరిహర వీరమల్లు. ఫైనల్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసి.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. మే 2వ తేదిన ఉదయం 9 గంటలకి వీరమల్లు అవైటెడ్ టీజర్ వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఈ అనౌన్స్‌మెంట్‌తో డైరెక్టర్ క్రిష్‌కు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి.
టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో క్రిష్ పేరు లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇదే కాదు.. రీసెంట్ పోస్టర్లలో కూడా క్రిష్ పేరు లేకపోవడం గమనించవచ్చు. అసలు క్రిష్ పేరు లేకుండా టీజర్ అప్టేడ్ ఏంటనేది.. అర్థం కాకుండా పోయింది. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ.ఎం. రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మధ్య వీరమల్లు గురించి ఈయన మాత్రమే అప్టేట్స్ ఇస్తున్నారు. క్రిష్ సైడ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. ఇక ఇప్పుడు ఏకంగా పోస్టర్లో ఆయన పేరు లేకపోవడంతో.. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా? అనే సందేహాలు మొదలయ్యాయి.
గతంలో క్రిష్ ప్లేస్‌లో ఏ.ఎం.రత్నం కొడుకు రత్నం కృష్ణ ఈ సినిమాను దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు పోస్టర్లో క్రిష్ పేరు లేకపోవడంతో.. ఇలాంటి వార్తలకు బలం చేకురినట్టైంది. పైగా క్రిష్, అనుష్కతో ఓ సినిమా మొదలు పెట్టాడు. కాబట్టి.. హరిహర వీరమల్లు దర్శకుడి పరిస్థితేంటి? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ టీజర్ పోస్టర్లో రత్నం కృష్ణ పేరు కూడా లేదు. లేదంటే.. అటెన్షన్ కోసం ఇలా ఏమైనా ప్లాన్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. మరి.. ఈ విషయంలో మేకర్స్ ఏం చెబుతారో చూడాలి.