»Alert To The Students Who Have Failed In Class 10 These Are The Supplementary Dates
10th Class Result: ‘పది’ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలెర్ట్.. సప్లిమెంటరీ తేదీలు ఇవే
పదవతరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయి. అలాగే రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
Alert to the students who have failed in class 10.. These are the supplementary dates
10th Class Result: తెలంగాణలో ఈరోజు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. కొంత మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారు మళ్లీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన తేదీలు వచ్చేశాయి. జూన్ 3 నుంచి 13 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. దీనికి సంబంధించిన టైంటేబుల్ విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మే16 తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. అలాగే మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం నేటి నుంచి 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవల్సిందిగా కోరారు. రీ కౌంటింగ్‌కు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు రూ. 1000 ఫీజును నిర్దేశించారు.
విడుదలైన ఫలితాల్లో బాలికలదే పైచేయి. 93.23 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధిస్తే, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. 99.5 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా అత్యధికంగా టాప్ ప్లేస్‌లో ఉంది. వికారాబాద్ జిల్లా 65.10 శాతంతో ఆఖరులో ఉంది. 3,927 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదు అవగా.. 6 పాఠశాలలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఇక తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థుల్లో 98.71 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు.